*ఘనంగా కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి*

*ఆ మహనీయుని జీవితం నేటి తరానికి ఆదర్శం*జిల్లా పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడు గ్రంధాలయ ఛైర్మెన్ గుర్రం మార్కండేయ*
నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్.తెలంగాణ గర్వించే గొప్పనేత కొండా లక్ష్మణ్‌ బాపూజీ అని జిల్లా పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడు గ్రంధాలయ ఛైర్మెన్ గుర్రం మార్కండేయ అన్నారు. మంగళవారం పద్మశాలి సంఘం అధ్యక్షుడు పిల్లలమర్రి పుల్లారావు అధ్వర్యంలో ప్రధాన కూడలి వద్ద కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటాని పూలమాలవేసి,నివాళులర్పించారు.అనంతరం ఆసుపత్రి రోగులకు పండ్లు,బ్రెడ్ అందజేశారు.జాతీయ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఎన్నికైన ఎర్రమాద సావిత్రి కు,మండల ఆర్ఎంపి మండల అధ్యక్షుడుగా ఎన్నికైన చిలుకూరి ఉపేందర్ కు సన్మానం చేశారు.ఈ సందర్భంగా పద్మశాలి సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు,గ్రంధాలయ ఛైర్మెన్ గుర్రం మార్కండేయ మాట్లాడుతూ.ఉద్యమకారుడిగా,ప్రజాస్వామికవాదిగా,పీడిత ప్రజల పక్షపాతిగా,నిబద్ధత కలిగిన గొప్ప రాజకీయ నాయకుడిగా కొండా లక్ష్మణ్‌ బాపూజీ జీవితం నేటి తరానికి ఆదర్శనీయమని,
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలంలో ఆయన చేసిన కృషిని,నిస్వార్థ సేవలను స్మరించుకున్నారు.అణగారిన వర్గాల హకుల సాధన కోసం, సహకార రంగాల పటిష్టత కోసం జీవితకాలం కృషి చేశారన్నారు.తెలంగాణ కోసం పోరాటం చేసిన బాపూజీ స్ఫూర్తి మలిదశ తెలంగాణ సాధన పోరాటంలో ఇమిడి ఉన్నదని తెలిపారు.ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి యారమద గిరి,కోశాధికారి రమేష్, ప్రచార కార్యదర్శి రావిరాల యుగంధర్,మాజీ అధ్యక్షులు చెరుకు పల్లి నరసింహ,బాలెన సైదులు,పద్మశాలి సంఘం నాయకులు అక్కలదేవి రవి,కోంగరి శ్రీను,నక్క శ్రీను,చిట్టిపోలు ఉపేందర్, ఎర్రమాద చంద్రమౌళి, శేఖర్,చంద్రయ్య,వెంకటకృష్ణ,యాదగిరి,నరేష్,శివ,శేఖర్ తదితరులు ఉన్నారు
Attachments area