//ఘనంగా కొండ లక్ష్మణరావు బాపూజీ జయంతి వేడుకలు//
సెప్టెంబర్ 27, సారంగాపూర్ జనం సాక్షి…, స్వతంత్ర సమరయోధుడు ఆచార్యకొండ లక్ష్మణరావు బాబుజి 107 వ జయంతి వేడుకలను మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో ముందుగా బాపూజీ చిత్రపటానికి ఎంపీపీ అట్ల మహిపాల్ రెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సరోజ సూపర్డెంట్ శ్యాంసుందర్, ఎంపీటీసీ పద్మ వీరయ్య, స్వర్ణ ఎంపీటీసీ భోజ రెడ్డి, కొండ రమేష్, ఆపరేటర్ దినేష్ పాల్గొన్నారు.