ఘనంగా గాంధీ జయంతి.

గాంధీ విగ్రహానికి పూల మాలలు వేస్తున్న ఆర్యవైశ్య సంఘం నాయకులు.
బెల్లంపల్లి, అక్టోబర్2,(జనంసాక్షి)
బెల్లంపల్లి పట్టణంలో ఆదివారం జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలను ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జీఎం చౌరస్తాలోని మహాత్మా గాంధీ విగ్రహానికి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసి, పూల మాలలు వేసి నివాళులర్పించారు. భారత దేశ స్వాతంత్ర్య పోరాటంలో ఆయన నాయకత్వం గొప్పవిషయం అని, అహింసా పరమో ధర్మ అనే సూక్తితో గాంధేయవాదం తో దేశానికి స్వాతంత్య్రం అందించిన గొప్ప వ్యక్తి అని, ఆయనను మన దేశం జాతిపిత అనే బిరుడుతో గౌరవిస్తుందని వారు ఆయన సేవలను కొనియాడారు. ఈకార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు చిలువేరు దయాకర్, సంఘ సభ్యులు రేణుకుంట్ల శ్రీనివాస్, తణుకు నందయ్య, పుల్లూరి వెంకటేష్, నరేంద్రుల వేణుగోపాల్, పాత భాస్కర్, విద్యాసాగర్, కిరణ్ కుమార్, గణపతి, శ్రీనివాస్, వంశీకృష్ణ, సాయి, నాగరాజు పాల్గొన్నారు.