ఘనంగా గెల్లు జన్మదిన వేడుకలు


హుజురాబాద్‌,ఆగస్ట్‌21(జనంసాక్షి): హుజురాబాద్‌ నియోజకవర్గ తెలంగాణరాష్ట్ర సమితి ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ జన్మదిన వేడుకలు కమలాపూర్‌ లో ఘనంగా జరిగాయి. కమలాపూర్‌ మండలంలో టిఆర్‌ఎస్‌ కార్యకర్తలు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి , మండల ఇంచార్జి పేరియాల రవీందర్‌ రావు హాజరై కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు తన జన్మదినం సందర్భంగా గెల్లు గ్రీన్‌ ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటారు.