ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

మర్పల్లి, సెప్టెంబర్ 26(జనం సాక్షి)
చాకలి ఐలమ్మ 127 జయంతి సందర్భంగా సోమ వారము రోజున మర్పల్లి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రములోని చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సదర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ పోరాట నాయకురాలు చాకలి ఐలమ్మ, తెలంగాణ సాయుధ పోరాటంలో అలుపెరుగని త్యాగాలు ధైర్య సాహసాలు చేశారని వారి త్యాగ ఫలితమే నేటి తెలంగాణ అని అన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా టీడీపీ అధ్యక్షులు సుభాష్ యాదవ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రామేశ్వర్, పి. ఏ. సి.యస్. వైస్ చైర్మన్ పసియొద్దిన్, వార్డ్ నెంబర్ అగమయ్య, మధు, రజక సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.