ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

 రజక సంఘ మండల అధ్యక్షుడు బోనగిరి లింగమూర్తి
పెద్దవంగర సెప్టెంబర్ 26(జనంసాక్షి)పెద్దవంగర మండల రజక సంఘం అధ్యక్షుడు బోనగిరి లింగమూర్తి.ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ  127 వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని గ్రామపంచాయతి కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండల రజక సంఘం అధ్యక్షుడు బోనగిరి లింగమూర్తి, పాలకుర్తి దేవస్థానం చైర్మన్ వెనుక దాసుల రాంచద్రయ్య శర్మ, స్థానిక ఎంపీటీసీ ఎదునూరి శ్రీనివాస్,మాట్లాడుతూ రజకులకు ప్రభుత్వం ద్వారా అందవలసిన ఎటువంటి పథకాలు అందడం లేదని,  ప్రభుత్వం రజకులను చిన్నచూపు చూస్తుందని అన్నారు . రాబోయే రోజుల్లో రజక బందు ప్రవేశ పెట్టాలని  తెలంగాణ ప్రభుత్వం కోరారు.పెద్దవంగర ఎక్స్ రోడ్డు నందు చాకలి ఐలమ్మ  విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లుగా తెలిపారు.  ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్  వేనకదాసుల లక్ష్మి, ఏ ఓ కుమారస్వామి,ఏ ఎఫ్ ఎస్ సి అధ్యక్షుడు   అనపురం రవి, తెరాస మండల ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ సంజయ్,ఉప సర్పంచ్  శ్రీరామ్ రాము, వార్డు సభ్యులు కోణం శోభా రమేష్,ఎదునూరి సమ్మయ్య,చెరుకు యాకయ్య,అనపురం రాణి,ముత్యాల భవాని,ఎస్ సి సెల్ అధ్యక్షుడు చిలుక బిక్షపతి, జడ్పీహెచ్ఎస్  హై స్కూల్ చైర్మన్  సుంకరి అంజయ్య,రజక సంఘ సభ్యులు ఎదునూరి మహేష్ యాకయ్య, గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకన్న,తదితరులు పాల్గొన్నారు