*ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి*

కమ్మర్పల్లి 26 సెప్టెంబర్(జనంసాక్షి) కమ్మర్పల్లి మండలంలోని ఉప్లూర్ గ్రామంలో చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా నాయకులు ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 1919లో వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కృష్ణాపురం గ్రామంలో ఓరుగంటి మల్లమ్మ సాయిలకు నాలుగవ సంతానంగా చాకలి ఐలమ్మ జన్మించిందని తెలిపారు.1940-44 సంవత్సరం మధ్యకాలంలో మిసనర్లో దేశముఖ్, రజాకార్ల రాచకాలకు ఎదురు తిరిగి పోరాడిన గొప్ప వ్యక్తి చాకలి ఐలమ్మ అని అన్నారు. యువతి యువకులు చాకలి ఐలమ్మ జీవితాన్నీ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బద్దం పద్మ చిన్నారెడ్డి, సొసైటీ చైర్మన్ రేగుంట దేవేందర్, గ్రామ ఎంపీటీసీ పిప్పర అనిల్, గ్రామ చాకలి సంఘం సభ్యులందరూ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.