ఘనంగా జరుగుతున్న అంబేద్కర్‌ జయంతి

బెల్లంపల్లి పట్టణం: బెల్లంపల్లి పట్టణంలో 123వ అంబేద్కర్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్‌ ఐక్యవేదిక ఆధ్వర్యంలో తిలక్‌ మైదానం నుంచి కాంటా చౌరస్తావరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్‌ చిత్రపటానికి సీపీఐ శాసనసభాపక్ష నేత గుండా మల్లేష్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్‌ యువజనసంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్‌ రడగంబాల బస్తీలో జయంతి వేడుకలను తాసీల్దారు సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా అన్నదానం నిర్వహించారు. మాలమహానాడు ఆధ్వర్యంలో బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.