ఘనంగా తెలుగు నాటక రంగ దినోత్సవం

నటులకు సిద్ధార్థ స్మారక పురస్కారం
కరీంనగర్‌ సాంస్కృతికం,న్యూస్‌టుడే: జిల్లా సాంస్కృతిక సంస్థల కళాకారుల సమాఖ్య రజతోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం స్థానిక నెహ్రూ యువజన కేంద్రంలో తెలుగు నాటక రంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.సీనియర్‌ కళాకారులయిన రొట్టె గుండయ్య నటరాజ మూర్తికి పూజచేసి ఉత్సవాలు ప్రారంభించారు.అనంతరం ‘తెలుగు నాటక రంగం – ప్రాధాన్యం,పరిరక్షణ’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు.సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు వై.ఎన్‌ శర్మ ఆధ్వర్యంలో ముఖ్యఅతిథి జడ్పీ సీఈవో చక్రధ్‌రావు చేతులమీదుగా సిద్ధార్థ స్మారక నాటకరంగం పురస్కారాలను రొట్టె గుండయ్య,మున్నూరి హన్మంతరావు,శ్రీజాకబ్‌,లాల్‌మహ్మద్‌ అందుబాటులో లేకపోవడంతో ఆయన తరఫున జితేందర్‌ రావులకు అందించారు.కార్యక్రమంలో డిప్యూటీ సీఈవో సత్యవతి,సమాఖ్య కార్యదర్శి కృపాదానం,కె.రవీందర్‌,సౌదాల ప్రతాప్‌,భాస్కర్‌రావు,టి.పూర్ణాచారి,తదితరులు పాల్గొన్నారు.
జిల్లా నాటక రంగ కళాకారులు సమాఖ్య ఆధ్వర్యంలో స్థానిక కళాభారతిలో తెలుగు నాటకరంగ దినోత్సవం జరిగింది. అధ్యక్షుడు రొడ్డ యాదగిరి కేక్‌కోసి కళాకారులకు పంచారు.కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఆగస్టీన్‌,తిప్పర్తి ప్రభాకర్‌,సింహచలం,యతీందర్‌,విజయరావు,రాజమౌళి,గద్దె ఉదయ్‌కుమార్‌, రమేష్‌ పాల్గొన్నారు.