ఘనంగా నిర్వహించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు

రాష్ట్ర బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 55వ జన్మదిన వేడుకలను నంగునూరు మండల కేంద్రంలో బిఎస్పి మండల నాయకులు కార్యకర్తలు బుధవారం ఘనంగా నిర్వహించారు.సిద్దిపేట నియోజకవర్గ ఇన్చార్జ్ మంద పాండు, బిఎస్పి సీనియర్ నాయకులు ఏటి ఆంజనేయులు మాట్లాడుతూ… ఎంతో విద్యావంతుడైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో బీఎస్పీ పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలోని పేద, బడుగు, బలహీన, అట్టడుగు వర్గాలకు సమన్యాయం జరుగుతుందని ప్రజలందరికీ ఉచిత విద్య వైద్యం అందుతుందని తెలియజేశారు. కెసిఆర్ పరిపాలనలో రాష్ట్రం అప్పులపాలై కొట్టుమిట్టాడుతుందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మారుమూల గ్రామాలకు కనీస వైద్య సౌకర్యాలు లేవని, నాణ్యమైన విద్య అందడం లేదని ఎద్దేవా చేశారు. దేశంలోనే బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ అని చెప్పుకొచ్చారు. భేంజి మాయావతి నాయకత్వంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ తెలంగాణ రాష్ట్రంలో బహుజన వాదాన్ని బహుజన్ సమాజ్ పార్టీని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లే మహోత్తరమైన నాయకుడని మెచ్చుకొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బహుజన వాదాన్ని ఒంటి చేత్తో నడపగల సత్తా ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కే ఉందన్నారు. నంగునూరు మండలంలో బహుజన్ సమాజ్ పార్టీని బలోపేతం అయ్యేంతవరకు నిరంతరం వారు శ్రమిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నంగునూరు మండల కన్వీనర్ రంగదాం భాను, నంగునూరు సెక్టార్ అధ్యక్షులు నీల రాకేష్, గణపురం సెక్టార్ అధ్యక్షులు ఆరెపల్లి శివకృష్ణ, పాలమాకుల సెక్టార్ ఉపాధ్యక్షులు ముండ్రాతి లింగం, నంగునూరు మండల సీనియర్ నాయకులు పులి రవి బాబు,  నంగునూరు మండల కమిటీ నాయకులు పాల్గొన్నారు.

తాజావార్తలు