ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

జహీరాబాద్ సెప్టెంబర్ 19 (జనం సాక్షి) జహీరాబాద్ పట్టణలో ని వెంకటేశ్వర హైస్కూల్ పూర్వ విద్యార్థులు సోమవారం అతిధి హోటల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు గతంలో చదివిన సమయంలో తీపి గుర్తులను మర్చిపోకుండ గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ దశరథ్ రెడ్డి, విట్టల్ , ఇస్మాయిల్ విద్యార్థులు సాయి రెడ్డి కృష్ణారెడ్డి, కృష్ణకుమార్, కే శ్రీనివాస్, లక్కీ మధు సయ్యద్ రెహమాన్, జి పులేందర్ నరేందర్ చారి, అంబదాస్ తదితరులు పాల్గొన్నారు.