ఘనంగా పోషక వార్షికోత్సవాలు.
దౌల్తాబాద్ సెప్టెంబర్ 19, జనం సాక్షి.
దౌల్తాబాద్ మండలంలోని మాచిన్ పల్లి గ్రామంలో లోని ఒకటవ అంగన్వాడీ కేంద్రంలో పోషకాహార వారోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ టీచర్ రాధిక రెడ్డి మాట్లాడుతూ రాబోయే తరాలు ఆరోగ్యంగా జీవించాలంటే పోషకాహారం తప్పనిసరి. ఈ విషయం అందరికీ తెలియజేయడానికి ప్రతి ఏటా సెప్టెంబర్ నెల పోషక ఆహార వారోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందు కోసం దౌల్తాబాద్ మండలంలోని మాచిన్ పల్లి ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో పోషకాహార వారోత్సవాలను నిర్వహించి సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి పలు కార్యక్రమాలు చేపడుతున్నాడు సదరు అంగన్వాడీ సిబ్బంది. ఈ మేరకు మాత శిశు సంక్షేమశాఖ క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తోంది. పిల్లల్లో పోషకాహార సమస్యలపై, దీర్ఘకాలిక వ్యాధులపై అవగాహన కలిగించడం ఈ కార్యక్రమం ఉద్దేశం. అతి తక్కువ ధరకు అధిక పోషకాలు ఉన్న ఆహారం ఎలా తీసుకోవచ్చో ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కలిగిస్తారు. పిల్లలకు 7 నెలల నుంచి జావలు, కూరగాయాలు, పండ్ల గుజ్జుగా చేసిన ఆహార పదార్థాలను రోజుకు రెండుసార్లు శిశువుకు 250 మిల్లీ లీటర్ల చొప్పున అందజేయాలని, అదేవిధంగా 11 నెలల లోపు చిన్నారులకు ఆహారం గుజ్జుగా చేసి రోజుకు మూడు దఫాలుగా 250 మిల్లీలీటర్ల చొప్పున అందించాలని అంగన్వాడీ టీచర్ రాధిక రెడ్డి అన్నారు. శరీరం పెరుగుదలకు, గుండె పని, శరీర ఉష్ణోగ్రత మొదలైనవాటికి తగినట్లు ఆహారం అందిస్తూ ఉండాలని విటమిన్ ఎ లోపం వలన రేచీకటి, కార్నియల్ క్యూరోసిస్ వ్యాధుల నివారణకు పాలు, పాలపదార్థాలు, ఆకు కూరలు, పసుపు పచ్చ కూరగాయలు, క్యారెట్, గుమ్మడి తీసుకోవాలి అని అన్నారు. ఇనుము లోపం వలన వచ్చే అనేమియా వ్యాధి నివారణకు ఎర్రటి మాంసం, గుడ్లలోని పసుపు, ధాన్యాలు, ఆకుకూరలు, శనగలు, నువ్వులు, చిక్కుళ్లు, పప్పులు, బెల్లం, డ్రై ప్రూట్స్, మొలకెత్తిన పప్పు ధాన్యాలు తీసుకోవాలి. అయోడిన్ లోపంతో వచ్చే గ్రంథివాపు వ్యాధి నివారణకు అయోడిన్ ఉన్న ఉప్పును మాత్రమే ప్రతి రోజు తీసుకోవాలి.
ప్రస్తుత పరిస్థితుల్లో పోషకాహార సమస్యలు రాకుండా అప్రమత్తం చేయడం ప్రధాన లక్ష్యం చెప్పారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ యాదమ్మ, అంగన్వాడీ టీచర్ పద్మ,వార్డు మెంబర్లు నారాబోయిన కుమార్,మంగలి లక్ష్మీ మరియు పిల్లల తల్లులు పాల్గొన్నారు.
Attachments area