ఘనంగా ప్రారంభమైన గణనాథుని రెండవ రోజు పూజలు
శంకరా పట్నం సెప్టెంబర్ 1(జనంసాక్షి) : వినాయక చవితిని రెండవ రోజుపురస్కరించుకుని గురువారం నాడువాడ వాడల వినాయక ప్రతిమలను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేశారు. మండపాలను క్లాత్ డెకరేషన్, లైటింగ్ తో అందంగా ముస్తాబు చేశారు. మహిళలు, చిన్నారులు, యువకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణనాథునికి ప్రత్యేక నైవేద్యాలు తయారుచేసి భక్తితో సమర్పించారు.