ఘనంగా బతుకమ్మ పండుగ నిర్వహించిన చందన స్కూల్
చౌటుప్పల్ (జనం సాక్షి),
చౌటుప్పల్ స్థానిక చందన స్కూల్లో బతుకమ్మ పండుగను నిర్వహించడం జరిగింది. దీనికోసం పిల్లలు రకరకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి తీసుకొనివచ్చారు. పిల్లలందరూ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడుతూ అందంగా సంప్రదాయ దుస్తులతో అలరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఉపాధ్యాయురాలు పద్మ పండగ యొక్క విశిష్టతను పిల్లలకు అర్థమయ్యేలా చక్కగా వివరించడం జరిగింది. తర్వాత పిల్లలు బతుకమ్మ పాటలతో అందంగా బతుకమ్మలు పేర్చిన విద్యార్థినులకు పాఠశాలలో కోలాటాలతో, పాటలు పాడారు. ఇంచార్జి స్వప్న బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయునిలు కే. స్వప్ప, నర్మద, పద్మ, నిర్మల, స్వప్న, రేణుక, అర్చన, గీత సౌమ్య, జగదీశ్వరి పాల్గొన్నారు.