ఘనంగా బీపీ మండల్ జయంతి.
నల్గొండ. జనం సాక్షి
బీసీ రిజర్వేషన్ల పితామహుడు బీపీ మండల్ 104వ జయంతిని పురస్కరించుకుని గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలో బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం మాట్లాడుతూ బీహార్ మాజీ ముఖ్యమంత్రి, హైకోర్టు జడ్జి పార్లమెంట్ సభ్యుడు, సంఘసంస్కర్త బిందెశ్వర్ ప్రసాద్ మండల్ గారు రెండవ వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ గా ఆనాడు 1990 ఆగష్టు 7వ తేదీన ఆయన ఇచ్చిన కమిషన్ నివేదిక ఆధారంగానే నాటి ప్రధాని విపి సింగ్ మండల్ కమీషన్ సిఫార్సులను అమలుచేస్తున్నామని ప్రకటించడం వలన ఈరోజు భారతదేశంలో దాదాపు 3,600 పైగా కులాలకు రిజర్వేషన్లు అందుతున్నాయని అన్నారు. ఆనాడు బీపీ మండల్ అంటేనే అగ్రకులాల నాయకులు భగ్గుమంటున్నా ఆయన వెనుకడుగు వేయకుండా భారతదేశంలోని బడుగు బలహీన వర్గాల కోసం చేసిన కృషి, చూపిన చొరవ, ఆయన తెగువ మరువలేనిదని కొనియాడారు. భారతదేశంలోని బడుగు బలహీన వర్గాల ప్రజాలందరం ఆగస్టు 25వ తేదీన మండల్ జయంతిని ఘనంగా వాడవాడలా జరుపుకోవాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీపీ మండల్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా కార్యదర్శి ఎలిజాల వెంకటేశ్వర్లు, నియోజకవర్గ అధ్యక్షుడు బోళ్ల నాగరాజు, శ్రావణ్, మధు, అనిల్, శివరాజ్, చంద్రశేఖర్, రవి, కుమార్, మారోజు రాజ్ కుమార్, గొబ్బిళ్ళ తదితరులు పాల్గొన్నారు.