ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం

నేరేడుచర్ల లో శనివారం ఎస్సీ, ఎస్టీ,బీసీ,మైనార్టీ వర్గాల ఆధ్వర్యంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవాన్ని  నిర్వహించారు.
 ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ న్యాయం,స్వేచ్ఛ సమానత్వం,సౌభారతృత్వాన్ని అందిస్తూ రూపొందించబడిన ఘనమైన రాజ్యాంగం భారత రాజ్యాంగం అని అన్నారు.ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది అని, దేశాన్ని ఒకే తాటిపై తెచ్చే రాజ్యాంగం మనదని, అలాంటి రాజ్యాంగాన్ని అందరూ గౌరవించుకొని బాధ్యతగల పౌరులుగా వెలుగొందుదామని కుల మత వర్గ ప్రాంతీయ బేధాలు లేకుండా వ్యక్తి స్వేచ్ఛగా బ్రతికే అవకాశాన్ని భారత రాజ్యాంగం కల్పించిందన్నారు.దేశాన్ని పాలిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వంతోపాటు రాష్ట్రాన్ని పాలిస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా రాజ్యాంగాన్ని మార్చాలని అంటున్నారని బిజెపి శక్తులు ఆర్ఎస్ఎస్  శక్తుల ప్రమేయంతో  అంబేద్కర్ రాసిన సమతా రాజ్యాంగాన్ని మార్చి ఇప్పటికే తాము వ్రాసి పెట్టుకున్న అసమాన రాజ్యాంగాన్ని అమలు చేయడానికి సిద్ధపడుతున్నారని అంబేద్కర్ రాజ్యాంగాన్ని రక్షించుకోలేకపోతే భారతదేశం అంధకారంలోకి నెట్టు వేయబడుతుందిఅని వక్తలు అభిప్రాయపడ్డారు.బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి రాపోలు నవీన్ కుమార్ అధ్యక్షతన జరిగిన* ఈ కార్యక్రమంలో దక్షిణ తెలంగాణ క్రిస్టియన్ మైనార్టీ కో ఆర్డినేటర్ అమరవరపు అబ్రహం, బిసి సంఘం జిల్లా అధ్యక్షులు ధూళిపాళ ధనుంజయ నాయుడు, జిలకర రామస్వామి కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులు జంగిలి వెంకటేశ్వర్లు, జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సరికొప్పుల నాగేశ్వరరావు, పాలకూరి బాబు, బహుజన సమాజ్ పార్టీ పట్టణ అధ్యక్షులు కర్రీ సతీష్ రెడ్డి, టీడీపీ పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఇంజమూరి వెంకటయ్య, షేక్ ఇంతియాజ్ చిలక రాజు శ్రీను,రామకృష్ణ, రావుల సత్యం, సామాజిక వేత్త గుండ్ర శ్రీనివాసరెడ్డి, రవి నాయక్, ఊదర వెంకన్న, అయిల నాగేశ్వరరావు, త్రిపుర సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.