ఘనంగా మహాత్మాగాంధీ జయంతి.

గాంధీ చిత్ర పటానికి పూల మాలలు వేస్తున్న మున్సిపల్ చైర్మన్.
బెల్లంపల్లి, అక్టోబర్2, (జనంసాక్షి)
బెల్లంపల్లి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేతా గాంధీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం మహాత్మా గాంధీ చేపట్టిన శాంతి యుత పోరాటం ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిందని, ఆయన విధానాలకు గాంధేయవాదం అనే నినాదం పుట్టుకొచ్చిందన్నారు. నేటికి మనందరికీ ఆయన ఆదర్శప్రాయుడు అని అందరు ఆయన అడుగుజాడల్లో నడవాలని కోరారు. ఈకార్యక్రమంలో కౌన్సిలర్లు బొడ్డు నారాయణ, గోసిక రమేష్, నాయకులు జీలకర వాసు, సముద్రాల మురళి, నెలికంటి శ్రీధర్, బడికెల రమేష్, టీఆరెస్ నాయకులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.