*ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి*
నేరేడుచర్ల( జనంసాక్షి) న్యూస్.భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్బంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూకల సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ లీడర్లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సందీప్ రెడ్డి మాట్లాడుతూ పంచాయతీరాజ్ వ్యవస్థ, ఐటీ రంగాన్ని ప్రవేశపెట్టడం, దళితులకు, గిరిజనులకు, మైనారిటీలకు రాజకీయ శక్తిని అందించడంలో రాజీవ్ కృషి మరువలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బచ్చలకూరి ప్రకాష్, రణపంగా నాగయ్య, మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రంగుల భాష, ఖాదర్ ఖాన్, జనార్ధన చారి, ఐఎన్టియుసి నాయకులు ముస్తఫా, సీనియర్ నాయకులు నూకల వెంకటరెడ్డి, రాచకొండ అజయ్ కుమార్,గజ్జల కోటేశ్వరరావు,బచ్చలకూరి సైబాల్, వడ్డగానిలింగయ్య,మానస్ రెడ్డి,బారీ సోమయ్య తదితరులు పాల్గొన్నారు.
