ముదురుతున్న వివాదం
` ఫైవ్‌ఐస్ నుంచి కెనడాను సాగనంపేందుకు అమెరికా సన్నాహాలు
న్యూయార్క్(జనంసాక్షి):కెనడాతో విభేదాలు మరింత పెంచేందుకు అమెరికా యత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా దాని ప్రధాన మిత్ర దేశాలతో కలిసి ఏర్పాటుచేసిన ఇంటెలిజెన్స్ కూటమి ‘ఫైవ్‌ఐస్’ నుంచి కెనడాను బయటకు పంపనున్నట్లు తెలుస్తోంది.ట్రంప్‌నకు అత్యంత సన్నిహిత సలహాదారుల్లో ఒకరైన పీటర్ నవర్రో ఈమేరకు ప్రతిపాదనలు సిద్ధంచేయగా.. దీనిపై చర్చలు జరుగుతున్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక బాంబు పేల్చింది. ఒట్టావోపై తీవ్రస్థాయిలో ఒత్తిడి పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకొన్నట్లు సమాచారం.ఈ ప్రతిపాదనకు ట్రంప్ మద్దతు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి పీటర్ ఈ ప్రతిపాదన తీసుకొచ్చిన వేళ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ బ్రిటన్‌ను కూడా తప్పుపట్టారు. అక్కడ పెరిగిపోతున్న వలస ముస్లింల జనాభానుద్దేశించి.. అణ్వాయుధాలు ఉన్న అసలైన దేశంగా బ్రిటన్ మారుతోందన్నారు. ట్రంప్ ప్రధాన అజెండా అయినా మేక్ అమెరికా గ్రేట్ అగైన్‌ను పూర్తిచేయాలంటే ఇంగ్లిష్ మాట్లాడే మిత్ర దేశాలను అమెరికా దూరం చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఫైనాన్షియల్ టైమ్స్ రిపోర్టును పీటర్ మాత్రం నాన్సెన్స్ అంటూ కొట్టిపారేశారు.మరోవైపు ట్రంప్ అధికారం చేపట్టిన నాటినుంచి కెనడాను 51వ రాష్ట్రంగా అభివర్ణిస్తూ దానిని విలీనం చేసుకోవాలనే కోర్కెను బయటపెట్టారు. అంతేకాదు.. ఆ దేశ ప్రధాని ట్రూడోను గవర్నర్‌గా సంబోధించారు. తాజాగా ఆ దేశంపై ఒత్తిడి తెచ్చేందుకు 25శాతం సుంకాలను సిద్ధం చేశారు. మార్చి నుంచి ఇవి అమల్లోకి రానున్నారు. రెండో ప్రపంచయుద్ధం విజయంలో ఇంటెలిజెన్స్ సహకారం కీలకపాత్ర పోషించిందని గుర్తించిన అమెరికా, యూకే.. 1946లో విశ్వసనీయ సమాచార మార్పిడి కోసం ఙఐఙూం ఒప్పందం చేసుకున్నాయి. ఆతర్వాత ఈ కూటమిని రెండుసార్లు విస్తరించారు. అలా 1956 నాటికి కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు కూడా ఇందులో చేరాయి. దీంతో అది ‘ఫైవ్ ఐస్ ఇంటెలిజెన్స్ అలయన్స్’గా రూపాంతరం చెందింది.ఈ కూటమిలోని సభ్యదేశాలకు చెందిన నిఘా ఏజెన్సీలు.. అధికారిక, అనధికారిక ఒప్పందాల ప్రకారం పనిచేస్తాయి. ఈ దేశాలు పరస్పరం సమాచార సేకరణలో సహకరించుకోవడం, కీలక విషయాలు పంచుకోవడం వంటివి దీని విధి. మానవ మేధ, భద్రతాపరమైన విశ్వసనీయ సమాచారం, సిగ్నల్ ఇంటెలిజెన్స్, భౌగోళిక`అంతరిక్ష నిఘా సమాచారం, రక్షణరంగానికి చెందిన నిఘా సమాచారాన్ని పరస్పరం పంచుకుంటాయి. సిగ్నల్ ఇంటెలిజెన్స్ అంటే.. మొబైల్ నెట్‌వర్క్, ఇంటర్నెట్, రాడార్, ఆయుధ వ్యవస్థల కమ్యూనికేషన్ సిస్టమ్స్ నుంచి వెలువడే ఎలక్ట్రానిక్స్ సిగ్నళ్లను సేకరిస్తాయి. ఇక ఉపగ్రహ చిత్రాల ద్వారా అందిన డేటాను కూడా ఇవి షేర్ చేసుకుంటాయి. దీంతోపాటు ఈ ఐదు దేశాల మధ్య పలు ఒప్పందాలు కూడా ఉంటాయి. ఈ ఐదు ఆంగ్లభాషను ప్రధానంగా మాట్లాడే దేశాలే కావడం విశేషం. భారత్‌తో ఖలిస్థానీ వివాదం వేళ.. కెనడా ఈ కూటమిని అడ్డంపెట్టుకొని విూడియాకు అవాస్తవ లీకులను ఇచ్చిన విషయం తెలిసిందే.