ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు
ఆదికవి వాల్మీకి మహర్షి ఆదర్శప్రాయుడు.
తాండూరు అక్టోబర్ 9(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం వాల్మీకి నగర్ లో వెలిసిన ఆదికవి మహా ఋషి వాల్మీకి జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం సుప్రభాత సేవలు మోదలుకొని వాల్మీకి మహర్షి విగ్రహానికి ప్రత్యేక పులతో అలంకరణలు చేస్తూ పెద్ద ఎత్తున పూజలను నిర్వహించారు .అనంతరం అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా వాల్మీకి బోయ యూత్ సభ్యులు మాట్లాడుతూ ఆదికవి వాల్మీకి మహర్షి ఆదర్శప్రాయుడిగా మహోన్నతమైన జీవితాన్ని గడిపారని అన్నారు. వాల్మీకి రామాయణాన్ని రచించారని, రామాయణం ఒకసారి చదివితే సేవా మార్గంలో ఎలా నడవాలో తెలుస్తుందన్నా రు. ప్రభుత్వం వాల్మీకి బోయలకు ఇచ్చిన హామీలను విస్మరించారని తెలిపారు. గిరిజనుల కు రిజర్వేషన్ 10 శాతం పెంచినందున వాల్మీకి బోయలను ఎస్టీలుగా గుర్తించి జీవో విడుదల చేయాలని విన్నవించు కున్నా ప్రభుత్వం విస్మరించిందన్నారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి బోయ కులసంఘం నేతలు, వాల్మీకి నగర్ కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Attachments area