ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి.

నెన్నెల, అక్టోబర్ 9, (జనంసాక్షి)
నెన్నెల మండల కేంద్రంలో ఆదివారం ఆదికవి వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని భక్త అంజనేయస్వామి దేవాలయంలో ఆదికవి వాల్మీకి మహర్షి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా వాల్మీకి బోయ యూత్ సభ్యులు మాట్లాడుతూ ఆదికవి వాల్మీకి మహర్షి ఆదర్శప్రాయుడిగా మహోన్నతమైన జీవితాన్ని గడిపారని అన్నారు. వాల్మీకి రామాయణాన్ని రచించారని, రామాయణం ఒకసారి చదివితే సేవా మార్గంలో ఎలా నడవాలో తెలుస్తుందన్నారు. ప్రభుత్వం వాల్మీకి బోయలకు ఇచ్చిన హామీలను విస్మరించినందుకు నిరసనగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ పరంగా నిర్వహించే ఆదికవి వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను బహిష్కరించినట్లు వారు తెలిపారు. గిరిజనులకు రిజర్వేషన్ 10 శాతం పెంచినందున వాల్మీకి బోయలను ఎస్టీలుగా గుర్తించి జీవో విడుదల చేయాలని విన్నవించుకున్నా ప్రభుత్వం విస్మరించిందని, దీనికి నిరసనగా నల్ల బ్యాడ్జీలు ధరించి వాల్మీకి బోయలకు ఎస్టీ హోదా ఇవ్వాలని ప్ల కార్డులు ప్రదర్శించారు. ఈకార్యక్రమంలో వాల్మీకి యూత్ సభ్యులు పాల్గొన్నారు.