ఘనంగా వినాయక చవితి వేడుకలు.

– గణనాథుడికి విశేష పూజలందించిన జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత, రామ కొండారెడ్డి దంపతులు.
బూర్గంపహాడ్ ఆగష్టు31 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల వ్యాప్తంగా గ్రామ గ్రామాన వాడవాడల వివిధ రూపాలలో కొలువైన గణనాథుడికి భక్తులు ఉదయం నుంచి విశేష పూజలు, ధూప, దీప నైవేద్యాలు అందించి భక్తులు పారవస్యం పొందారు. అశేష భక్తులతో విశేష పూజలు అందుకున్న లంబోధరున్ని తెల్లవారుజాము నుండి వివిధ పూలు, పండ్లు, 21 రకముల పత్రిలతో, మండపాలను విద్యుత్ అలంకరణలతో శోభాయమానంగా తీర్చిదిద్ధి, ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. అనంతరం గణనాథుని ఆశీస్సులు ఉండాలని వేడుకున్నారు. ఏ పూజ నిర్వహించాలన్న ముందుగా గణపతి పూజ తోనే మొదలు పెడతారు, పండుగలలో వచ్చే పండుగ మొదటి పండుగ వినాయక చవితి పండుగ, అంతటా ఈ పండుగను ప్రజలు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకుంటారు.
బూర్గంపహాడ్ మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలోని స్థానిక జెడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత స్వగృహం నందు ఏర్పాటు చేసిన విగ్నేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత-రామకొండా రెడ్డి దంపతులు. ఈ సందర్భంగా మండల ప్రజలకు జడ్పీటీసీ దంపతులు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపి విగ్నేశ్వరుడి ఆశీర్వాదాలతో విఘ్నాలు తొలగిపోయి ప్రజలందరూ సుఖసంతోషాలతో, సిరిసంపదలతో ఉండాలని కోరుకున్నారు.