ఘనంగా వీర హనుమాన్ ఆలయాన్ని ప్రారంభించిన కట్ట మైసమ్మ కమిటీ బృందం

:శామీర్ పేట్ , జనం సాక్షి : శామీర్ పేటలోని వీర హనుమాన్ ఆలయాన్ని వేదపండితుల మంత్రోచ్ఛారణలతో, కట్ట మైసమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పెద్దలు ఘనంగా ప్రారంభించారు. బుధవారం మండల కేంద్రం శామీర్పేటలో శాస్త్రోక్తంగా నిర్మించిన వీర హనుమాన్ ఆలయంలో ఉదయం నుండి ప్రారంభమైన పూజా కార్యక్రమంలో వేదపండితులు హోమం, యజ్ఞం వంటి పలు పూజా కార్యక్రమా లు నిర్వహించి ఆలయ ప్రాంగణంలో శివలింగం, నంది విగ్రహాలను ప్రతిష్ఠించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అన్నదాన కార్యక్రమంలో గ్రామంలో ని దివ్యజ్యోతి హైస్కూల్ విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.కమిటీ సభ్యులను దుర్గ కాలనీ వాసులు కృష్ణ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో శామీర్పేట కట్టమైసమ్మ ఆలయ కమిటి చైర్మన్ బత్తుల ప్రభాకరాయాదవ్, కోశాధికారి శ్రీనివాస్ రెడ్డి, స్థానిక సర్పంచ్ బాలమణి, బిఆర్ఎస్ పార్టీ శామీర్పేట మండల అధ్యక్షుడు వి. సుదర్శన్, మాజీ సర్పంచ్ బత్తుల కిషోర్ యాదవ్, ఐలయ్య యాదవ్,ఎంపీటీసీ డప్పు సాయిబాబా, ఉప సర్పంచ్ నర్ల రమేష్,వార్డు సభ్యులు శ్రీకాంత్, రవి, కమిటీ బృందం శివ, కుమార్, పరశురామ్, మధు, వెంకటేష్, గ్రామస్తులు ఇర్రి గన్నారెడ్డి, జూపల్లి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు. 16ఎస్పీటీ -1: పూజలో పాల్గొన్న నాయకులు, కమిటీ సభ్యులు