ఘనంగా వేణుగోపాలస్వామి బ్రహ్మూెత్సవాలు

ఎల్లారెడ్డిపేట : మండలంలోని గొల్లపల్లి గ్రామంలో వేంచేసియున్న శ్రీ వేణుగోపాలస్వామివారి వార్షిక బ్రహ్మూెత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా స్వామివారికి ఎదుర్కొళ్లను నిర్వహించారు. బుధవారం జరిగే కల్యాణోత్సవం, స్వామి వారి రథోత్సవంతో బ్రహ్మూెత్సవాలు ముగియనున్నాయి. అల్మన్‌పూర్‌లో కర్మషట్కం పారాయణం ప్రవచనాలు చెప్పారు. ఏప్రిల్‌ 19న జరిగే శ్రీ సీతారామా కళ్యాణ మహోత్సవాలకు ఆలయ కమిటీ సభ్యులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.