ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి
పినపాక నియోజకవర్గం సెప్టెంబర్ 02 (జనం సాక్షి): వైయస్ రాజశేఖర్ రెడ్డి13వ వర్ధంతి సందర్భంగా మణుగూరు పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో మణుగూరు మండల వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షులు బుర్ర సోమేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో వైయస్సార్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసి చిరస్థాయిగా నిలిచిన మన ప్రియతమ తెలుగువారి ఆత్మబంధువు వైయస్సార్ అన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలను పేదలకు వరంగా అందజేసిన గొప్ప మహనీయుడు పేద ప్రజల ప్రాణాలకు తన ప్రాణం అడ్డువేసి 108 ద్వారా అత్యవసర వైద్య సేవలు అందించారు. ఎంతోమంది నిరుపేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యాన్ని అందించి పేదల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయన మీద అభిమానంతో ఇప్పటికీ ఎంతోమంది వైయస్సార్ పార్టీలో చేరటానికి ముందుకు వచ్చారు. ఈరోజు వివిధ పార్టీలకు చెందిన 50 మంది మహిళలు పార్టీలో చేరారు. వైయస్సార్ వర్ధంతి సందర్భంగా రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అశ్వాపురం మండల అధ్యక్షులు గ్రూప్ ప్రసాద్ రెడ్డి కరగ్గూడం మండల అధ్యక్షులు సత్యప్రసాద్ గౌడ్ మహిళా మండల దిశా కమిటీ అధ్యక్షులు ఇటికల మాధవి లక్ష్మి కుసుమ పూజారి లక్ష్మి అరిఫా తదితరులు పాల్గొన్నారు.