ఘనంగా శివ పూజ

కాగజ్‌నగర్‌ గ్రామీణం: మండలంలోని నజ్రూర్‌ నగర్‌లో ఛైత్రమాసం సందర్భంగా ఆదివారం శివపూజ ఘనంగా నిర్వహించారు. నజ్రూర్‌నగర్‌ విలేజ్‌ నెంబర్‌ 12లో వేద పండితుడు అతుల్‌ ముఖోపాధ్యాయ మంత్రోఛ్చారణల మధ్య కాందిశీకులు శివపూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.