ఘనంగా శ్రీదాసాంజనేయ స్వామి రెండవ వార్షికోత్సవాలు

ఎల్లారెడ్డిపేట, జనంసాక్షి: ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలోని శ్రీదాసాంజనేయ స్వామి ఆలయ రెండవ వారికోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి చందనం, ఆకుపూజ, పూర్ణాహుతి, ఆశీర్వచనం చేశారు. హనుమాన్‌ దీక్షా సేవాసమితి ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు.