ఘనంగా సంతోషిమాత బ్రహ్మోత్సవాలు

\సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):స్థానిక సంతోషిమాత దేవాలయం ప్రతిష్టించబడి 27 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం సంతోషిమాత బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భముగా దేవాలయ ప్రధాన అర్చకులు ఇరువంటి శివరామకృష్ణ తెల్లవారుజామునే  సంతోషిమాత, సత్య సాంబ శివుడు,లక్ష్మీ గణపతి, ఆంజనేయ స్వామి,సంతాన నాగదేవతలకు ప్రత్యేక పంచామృత అభిషేకం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భముగా కలశస్థాపన పూజ,పుణ్యాహవాచనం,మంటప ఆరాధన పూజలు జరిపించారు.లక్ష్మిగణపతి,రుద్ర,లలితా హోమమం మహా పూర్ణాహుతి నిర్వహించారు.అమ్మవారికి కుంకుమార్చన,గాజుల పూజ,పసుపు కొమ్ముల పూజ నిర్వహించారు.సంతోషిమాతకు త్రిభువన మహా సామ్రాజ్య పట్టాభిషేకం, మహదాశీర్వచనం నిర్వహించారు.అనంతరం భక్తులకు అన్న ప్రసాదాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో దేవాలయ అధ్యక్ష,కార్యదర్శులు నూకా వెంకటేశం గుప్తా, బ్రహ్మాండ్లపల్లి మురళీధర్ , కోశాధికారి పాలవరపు రామమూర్తి, ఉపాధ్యక్షులు నరేంద్రుని విద్యాసాగర్ రావు,పబ్భా ప్రకాశరావు,కొత్త మల్లికార్జున్, కమిటీ సభ్యులు  అశోక్, యాదగిరి, పాపిరెడ్డి, రమేష్ , శ్రీశైలం, బ్రహ్మయ్య, సోమయ్య వెంకటేశ్వర్లు, ఉపేందర్, నాగమణి,భాగ్యరేఖ, పద్మ , నాగలక్ష్మి , కవిత, లింగారెడ్డి, రత్నమాల, ప్రభావతి,సూర్యకళ,విజయలక్ష్మి,శోభారాణి,భారత లక్ష్మీ,అర్చకులు మంగిపుడి వీరభద్రశర్మ, భట్టారం వంశీ కృష్ణ శర్మ, బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.
Attachments area