ఘనంగా సీతారాముల కల్యాణం

మెట్‌పల్లి టౌన్‌, జనంసాక్షి: శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఖాదీ ప్రాంగణంలో ఆంజనేయస్వామి ఆలయ నిర్వాహకులు సీతారాముల కల్యాణాన్ని జరిపారు. ఈ కల్యాణంలో కొరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పాల్గొని స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆంజనేయస్వాముల భజనలతో అలయ ప్రాంగణం మారు మోగింది. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, ఖాదీభాండార్‌ నిర్వారహకులు పాల్గొన్నారు.