ఘనంగా సీతారాముల వూరేగింపు
సారంగాపూర్ గ్రామీణం: శ్రీరామనవమి సందర్భంగా మండల కేంద్రంలో సీతారామ స్వామివారిని ఈరోజు పల్లకిలో వూరేగించారు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భక్తుల స్వామివారిని పూలతో అలంకరించి పల్లకిలో ఉంచారు. అనంతరం రామనామ సంకీర్తనల మధ్య గ్రామంలో వూరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ లింగారెడ్డి , భక్తులు పాల్గొన్నారు.