ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుక
గద్వాల నియోజకవర్గం పట్టణంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరితమ్మ అధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంగా పట్టణంలోని రాజీవ్ సర్కిల్ నందు ఏర్పాటు చేసిన వేడుకలో సోనియా గాంధీ చిత్రపటాన్నికి క్షీరాభిషేకం చేసి,కేక్ కట్టింగ్ చేసి సోనియామ్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు… అనంతరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సరితమ్మ మాట్లాడుతూ దేశంలో ప్రధాని గా అవకాశం వచ్చిన త్యాగం చేసిన గొప్ప నాయకురాలు సోనియా గాంధీ అని,పేదవాడు మూడుపూటలా భోజనం చేయాలని,వందరోజుల పని తీసుకొచ్చిన తల్లి,ప్రశ్నించే తత్వం బతికి ఉండాలని సమాచార హక్కు చట్టం ఇచ్చిన గొప్ప మహోన్నత వ్యక్తి,60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన మహనీయురాలు శ్రీమతి సోనియా గాంధీ గారికి జన్మదిన పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహాలక్ష్మి పథకం క్రింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,నిరుపేదలకు 10 లక్షల ఆరోగ్య శ్రీ పథకం ప్రారంభించడం ప్రజల మనసులో గుర్తుండిపోతుందని సరితమ్మ అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ జెడ్పి చైర్ పర్సన్ బండారి భాస్కర్,గంజిపేట్ శంకర్, బండ్ల చంద్రశేఖర్ రెడ్డి,మధుసూదన్ బాబు,అమరావాయి కృష్ణారెడ్డి,ఎం.ఎ.ఇషాక్,నల్లారెడ్డి,మోహన్ రావు,రామలింగేశ్వర కాంళ్లే,లత్తిపురం వెంకట్రామిరెడ్డి, యూసుఫ్,బిజ్వారం శ్రీనివాస్ రెడ్డి,వాకిటి సంజీవులు,డిటిడిసి నరిసింహులు, నాగేంద్ర యాదవ్,ఎల్లప్ప,భాస్కర్ యాదవ్,శ్రీనివాస్ గౌడ్, అల్వాల రాజశేఖరరెడ్డి,షఫీవుల్లా,మాల శ్రీనివాసులు,TNR జగదీష్,జమ్మిచేడు సురేష్, ఆనంద్, తిమోతి, రాము,ధరూర్ శ్రీకాంత్ రెడ్డి,పూడూర్ ఈశ్వర్,బోయ శ్రీను, తాన్యనాయక్,నాగ శంకర్,జయక్రిష్ణ,మనోజ్, రామకృష్ణ,మహిమూద్,భాస్కర్ రెడ్డి, సత్యరెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటీసిలు,మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు…