ఘనపూర్ లో రెండు కోట్ల రూపాయలతో ప్రభుత్వ ఉన్నత పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన
నందిగామలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్చెరు నవంబర్ 9 (జనం సాక్షి)
ప్రభుత్వ విద్యా రంగంలో మన ఊరు మనబడి పథకం విప్లవాత్మక మార్పులు శ్రీకారం చూడుతోందని, నియోజకవర్గంలో ప్రభుత్వ నిధులతో పాటు సిఎస్ఆర్ నిధులతో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.పటాన్చెరు మండల పరిధిలోని ఘనాపూర్, నందిగామ, పోచారం, రుద్రారం గ్రామాలలో 2 కోట్ల 89 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథి హాజరై శంకుస్థాపన చేశారు. ఘనాపూర్ గ్రామంలో గ్లాండ్ ఫార్మ పరిశ్రమ సహకారంతో రెండు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం పోచారం, బచ్చుగూడ, రుద్రారం గ్రామాలలో నూతన సిసి రోడ్లు, మురుగునీటి కాలువల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రుద్రారం గ్రామంలో పది లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన రజక సంఘం భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన గ్రామాలను ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళుతున్నామని తెలిపారు. ప్రధానంగా మౌలిక వస్తువుల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. మన ఊరు మనబడి ద్వారా నియోజకవర్గంలోని 55 ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. పురాతన భవలాలను కూల్చివేసి నూతన భవనాలను నిర్మిస్తున్నామని తెలిపారు. ఘనాపూర్ గ్రామంలో నూతన పాఠశాల భవనం నిర్మించడం పట్ల గ్రామ వాస్తవ్యురాలు హైదరాబాద్ కమిషనరేట్ అడిషనల్ డిసిపి (షీ టీమ్స్) శిరీష ఎమ్మెల్యే జిఎంఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, ఎంపీపీ ఎంపీడీవో బన్సీలాల్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకటరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు కావ్య కాశిరెడ్డి, ఉమావతి గోపాల్, సుమతి రామచందర్, జగన్, సుధీర్ రెడ్డి, ఎంపీటీసీలు నీనా చంద్రశేఖర్ రెడ్డి, రాజు, నాగలక్ష్మి లక్ష్మణ్, బిక్షపతి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాండు, వివిధ శాఖల అధికారులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.