ఘన వ్యర్ధాల నుండీ సంపద సృష్టి చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ

కోదాడ పురపాలక సంఘం పరిధి లోని 8వ వార్డ్ ఉత్తమ్ పద్మావతి నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన తడి, పొడి చెత్తను వేరుచేసే కేంద్రాన్ని పరిశీలించిన కోదాడ మునిసిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ అన్నారు. డీఆర్‌సీ పొడి చెత్త సేకరణ కేంద్రం ముఖ్య ఉద్దేశం డంపింగ్‌ యార్డుకు విలువైన పొడి చెత్త అనగా పేపర్‌ వేస్ట్‌, ప్లాస్టిక్‌, ఇనుప సామాన్లు, బీరు బాటిల్‌, అట్ట పెట్టలను వృథాగా వేయడం వల్ల డంపింగ్‌ యార్డ్‌లో స్థలాభావం ఏర్పడుతుందని తెలిపారు. రీసైక్లింగ్‌ చేసి తిరిగి ఉపయోగించుకునే అవకాశం లేకుండా పోతుందన్నారు. పొడి చెత్తను వేరు చేయడం వలన రీసైక్లింగ్‌కు అవకాశం ఉంటుందని చెప్పారు.15 రోజుల క్రితం ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ద్వారా 11 క్వింటాళ్ల అట్టాలు, 7 క్వింటాళ్ల ప్లాస్టిక్, 11 క్వింటాళ్ల చెత్త కాగితాలు, 4 క్వింటాళ్ల గ్లాస్ ను రీసైక్లింగ్ యూనిట్ వారికి అమ్మటం వలన 35,360/- ఆదాయం పురపాలక శాఖ కి వొచ్చింది అని తెలిపారు. అంతేకాకుండా పట్టణం లోని వివిధ ప్రాంతాల నుండి వొచ్చే తడిచెత్త తో 90 క్వింటాళ్ల కంపోస్ట్ ఎరువును తయారు చేస్తున్నారు అని ఈ కంపోస్ట్ ఎరువును హరితహరం లో నాటినటువంటి  మొక్కలకి వెయ్యడం జరుగుతుంది అని ఇలా ఈ విధంగా తడి పొడి చెత్తలను రీసైక్లింగ్ చెయ్యడం వల్ల పట్టణం లో ఉత్పత్తి అయ్యే చెత్త 20% మాత్రమే డంపింగ్ యార్డు కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అని అన్నారు.
ఈ కార్యక్రమం లో వీరితో పాటు వార్డ్ కౌన్సిలర్స్ బానోతు రమణ నాయక్, పెండెం వెంకటేశ్వర్లు, షేక్ మధార్ సాహెబ్, తిపిరిశెట్టి సుశీల రాజు, ధరవత్ కైలా స్వామినాయక్, మునిసిపల్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.