ఘాట్‌రోడ్డులో బోల్తాపడ్డ పెళ్లివ్యాను 

ఆరుగురు మృతి..కొందరికి గాయాలు
కాకినాడ,అక్టోబర్‌30(జ‌నంసాక్షి):  పెళ్లివ్యాను బోల్తా పడి ఆరుగురు మృతిచెందారు. ఈ ఘోర సంఘటన తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండ ఘాట్‌రోడ్డులో వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద చోటుచేసుకుంది. పెళ్లికి హాజరై తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బ్రేక్‌ ఫెయిల్‌ కావడంతో వ్యాను కొండపై నుంచి కింద పడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నలుగురిని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను గోకవరం మండలం టాకుర్‌పాలెం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు సహాయ చర్యలు ప్రారంభించారు. తుంటికొండ ఘాట్‌ రోడ్డులో వెంకటేశ్వరస్వామి దేవాలయం వద్ద శుక్రవారం తెల్లవారుజామున పెళ్లి బృందం ఉన్న వ్యాను బోల్తా పడడంతో  ఆరుగురు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.  మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఆలయంలో పార్కింగ్‌ ప్లేస్‌ విూదుగా రోడ్డు విూదికి రావాల్సిన వ్యాన్‌ మెట్లు పై నుంచి ఒక్కసారిగా కింద పడినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో వ్యాన్‌లో 17 మంది పెళ్లి బృందం ఉన్నారు. మతులు శ్రీదేవి, శ్రీలక్ష్మి, భాను, ప్రసాద్‌, దొరగా పోలీసులు గుర్తించారు. వధువు.. స్వస్థలం రాజానగరం మండలం వెలుగుబంద కాగా, వరుడు స్వస్థలం గోకవరం మండలం ఠాకూర్‌పాలెంకి చెందిన వారిగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.