ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
మెదక్: జిల్లాలోని కోహీర్ మండల పరిధిలోని కవేలి చౌరస్తా సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం అర్థరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు.మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కృష్ణా జిల్లా కొవ్వాడలంక గ్రామానికి చెందిన వీరంతా కర్ణాటక రాష్ట్రంలోని ఖేడారంజోల్ నుంచి ఖమ్మం వెళ్తుండగా మార్గమధ్యంలో ప్రమాదానికి గురయ్యారు. వీరు ప్రయాణిస్తున్న జీపు ఎదురుగా వస్తున్న చెరకు ట్రాక్టర్‌ను ఢీకొనడంతో ఘటన జరిగింది. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో జహీరాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.