చంచల్ గూడ జైలుకు రేవంత్ రెడ్డి

 హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. అసెంబ్లీ వద్ద ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న రేవంత్‌ను పోలీసులు అరెస్ట్‌చేసి చంచల్‌ గూడ జైలుకు తరలించారు. మరోవైపు చంచల్‌గూడ జైలు ఆవరణలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. రేవంత్‌కు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది.