చంద్రబాబుకు వ్యతిరేకంగా బలపడుతున్న రాజకీయ పార్టీలు

బాబుకు గుదిబండ కానున్న ప్రత్యేక హోదా

మారుతున్న సవిూకరణాలతో ఓటర్ల మనోగతంలోనూ మార్పు

అమరావతి,జూన్‌25(జ‌నం సాక్షి ): ఎపిలో ఇప్పుడు చంద్రబాబును ఎలా ఓడించాలా అనే విషయంపై అన్ని పార్టీలు రాజకీయంగా తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఎవరు ఎవరిని ఎందుకు కలుస్తున్నా అందరి లక్ష్యం మాత్రం చంద్రబాబు అన్నట్టుగా ఉంటోంది. వైకాపా రాజకీయ వ్యూహంలో చిక్కుకున్న చంద్రబాబు ఎన్‌డిఎ నుంచి బయటకు రావడం, బిజెపితో వైరం పెంచుకోవడంతో తనకుతానుగా శతృవులను పెంచుకున్నారు. ఇంతకాలం వైకాపా మాత్రమే శతృపక్షంలో ఉండేది. ఇప్పుడు జగన్‌, జనసేన, బిజెపితో ఆపటు లెఫ్ట్‌ పార్టీలు కూడా చేరాయి. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఒకవైపు మిగతా వారంతా ఒకవైపు అన్న రీతిలో ఎపి పాలిటిక్స్‌ సాగుతున్నాయి. ప్రత్యేక¬దా, ప్రత్యేక ప్యాకేజీ, అమరావతి, పోలవరం ఇలా అనేక విసయాల్లో బాబు చేసిన తప్పిదాల కారణంగా రాజకయీంగా చంద్రబాబుకు అందరూ శత్రువులుగా మారుతున్నారు. కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం అంతకు ముందు నుంచీ చంద్రబాబుపై కారాలు? మిరియాలు నూరుతున్నారు. ఇటీవల తిరుమలలో ప్రధాన అర్చకుడిగా పనిచేసిన రమణ దీక్షితులు కారణంగా ప్భుత్వం ఉదాసీనత బయటపడింది. అది కూడా బాబుకు త్యతిరేకంగా మారుతోంది. తిరులలో రాజకీయాలు చేస్తున్‌ఆనరని ప్రజల్లో బలంగా నాటుకుని పోంది. తెలంగాణలో పదవులు అశించి భంగప్డడ మోత్కుపల్లి నరసింహులు కూడా ఇప్పుడు బాబు వ్యతిరేక జాబితాలో చేరారు. దీనికితోడు నాలుగేళ్లు ప్రచారార్భాటంతో నెట్టుకుని వస్తోన్న చంద్రబాబుకు శత్రువుల సంఖ్య పెరుగుతోంది. ఇకపోతేఎలాగూ బిజెపిని బాబు దూరం చేసుకున్నందున బిజెపి కూడా ఇక ఎపిలో పాగా వేయడమెలా అన్న రీతిలో ముందుకు సాగుతోంది. చంద్రబాబుకు వ్యతిరేకంగా బిజెపి పెద్దలు పావులు కదపడం మొదలుపెట్టారు. ప్రత్యేక¬దా కారణంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలలో నరేంద్ర మోదీపై తీవ్ర వ్యతిరేకత ఉన్నందున ఆయనను టార్గెట్‌గా చేసుకుని చంద్రబాబు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీంతో ఎట్టి పరిస్థితులలోనూ చంద్రబాబు మళ్లీ గెలవకుండా బిజెపి పావులు కదుపుతోంది. రాంమాధవ్‌ వంటి వారు ఈ విషయంలో చురుకుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే స్థానిక బీజేపీ నాయకులు ముఖ్యమంత్రిపై తీవ్రాతితీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. రాజకయీ పార్టీ అన్నాక అధికారంలోకి రావడమే లక్ష్యం కనుక బిజెపి కూడా గట్టిగానే ముందుకు సాగుతోంది. మరోవైపు ఇచ్చిన హావిూని నిలబెట్టుకోవడంలో చంద్రబాబు విఫలం అయ్యారు. దీనికి తోడు తెలంగాణలో పార్టీకి భవిష్యత్తు కనిపించకపోవడంతో నరసింహులు లాంటి వారు ముఖ్యమంత్రి చంద్రబాబుపై ద్వేషంతో బయటకు వచ్చారు. దీంతో చంద్రబాబునాయుడు శత్రువులకు మరో ఆయుధం దొరికినట్టయ్యింది. కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఇటీవలే నరసింహులును కలిసి ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించి చంద్రబాబును ఓడించడానికి సహకరించవలసిందిగా కోరారు. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా అదే ప్రతిపాదన చేశారు. దీంతో సొంత రాష్ట్రం తెలంగాణలో పెద్దగా పనిలేకపోయినా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం మోత్కుపల్లికి రాజకీయంగా పని పెరిగేలా ఉంది. వైకాపాను అధికారంలోకి తీసుకుని వచ్చే క్రమంలో విజయసాయి రెడ్డి కూడా బాగానే కృషి చేస్తున్నారు. చంద్రబాబు వ్యతిరేకులను ఏకం చేయడంలో అలుపెరుగని కృషి చేస్తున్నారు. ఢిల్లీ భారతీయ జనతా పార్టీ పెద్దలతో సత్సంబంధాలు ఏర్పరుచుకుని బాబు వైఫల్యాలను చేరవేస్తున్నారు. విజయసాయిరెడ్డి వైసీపీ రాజకీయా లలో ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా అటు ఢిల్లీ పెద్దలకు తమ నాయకుడు జగన్మోహన్‌రెడ్డికి మధ్య అనుసంధానకర్తగా ఉంటూ, ఇటు తెలుగుదేశం నాయకులకు కంటి విూద కునుకు లేకుండా చేస్తున్నారు.ప్రత్యేక ¬దా అంశంపై భారతీయ జనతాపార్టీతో విభేదించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇప్పుడు చుక్కలు చూపించే ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రభుత్వంలోని లోపాలను సేకరించే పనిలో బీజేపీ పెద్దలు తలమునకలైంది. బీజేపీ నాయకులు చంద్రబాబును బలహీనపర్చడానికై ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్‌రెడ్డికి సహకరిస్తున్నారని టిడిపి వారు ఆరోపిస్తున్నారు. తనకు వ్యతిరేకంగా చేతులు కలుపుతున్న రాజకయీ ప్రత్యర్థుల వ్యూహాలను చంద్రబాబు ఎలా ఎదుర్కొంటారో చూడాలి. వచ్చే ఎన్నికలు మాత్రం చంద్రబాబుకు అంత ఈజీ కావని అర్థం అవుతున్నాయి. నాడు మిత్రపక్షాలుగా ఉన్న జనసేన, బీజేపీ ఇప్పుడు టీడీపీకి ప్రత్యర్థులుగా నిలిచాయి. అలా అని భారతీయ జనతా పార్టీతో ఎన్నికలలో నేరుగా పొత్తుపెట్టుకునే పరిస్థితులలో వైసీపీ లేదు. రాష్ట్రం విడిపోయి నాలుగేళ్లు అయినా కాంగ్రెస్‌ పార్టీ మాత్రం బలం పుంజుకోలేదు. దీంతో ఆ పార్టీతో పొత్తుకు ఎవరూ సిద్ధంగా లేరు. మారుతున్న రాజకీయ సవిూకరణాలకు అనుగుణంగా ఓటర్లలో కూడా సవిూకరణాలు మారుతాయి. కొంత కాలం ఆగితేగానీ ఏపీ రాజకీయాలలో స్పష్టత రాదు. ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి ఎదురయ్యే సవాళ్లు, సమస్యలను ఎదుర్కొంటూ తనను తాను కాపాడుకుంటూ, పార్టీని విజయం వైపు నడిపించవలసిన బాధ్యత ఇప్పుడు చంద్రబాబుపై ఉంది.