చంద్రబాబు తీరుతోనే..
ప్రత్యేక హోదా రాలేదు
– తెదేపా ఎంపీలు రాజీనామా చేసుకుంటే కేంద్రంలో చలనమొచ్చేది
– సొంత లాభాలకోసం చంద్రబాబు ¬దాను తాకట్టుపెట్టాడు
– విలేకరుల సమావేశంలో వైసీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
విజయవాడ, జూన్22(జనం సాక్షి ) : దేశంలో 10కి పైగా రాష్ట్రాల్లో ఉన్న ప్రత్యేక ¬దాను ఏపీకి ఇవ్వకుండా టీడీపీ అడ్డుకుందని ఏపీ శాసనమండలి విపక్షనేత, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ¬దా కనుక ‘ఇస్తే కేవలం నిరుద్యోగులకే కాదు అన్ని వర్గాల వారికి ప్రయోజనం ఆనాడు కలుగుతుందని పార్లమెంట్‌లో చెప్పారని, వెంకయ్య నాయుడు సైతం 5 ఏళ్లు కాదు 15ఏళ్లు ¬దా కావాలని డిమాండ్ చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ప్రధాని కావాలని భావించిన నరేంద్ర మోదీగానీ మేం అధికారంలోకి వస్తే ప్రత్యేక ¬దాను ఇస్తామని హావిూ ఇచ్చారు. ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. కేంద్రం, రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ, చంద్రబాబులు ¬దాపై మాట మార్చారని’ ఉమ్మారెడ్డి గుర్తుచేశారు. 2014 ఎన్నికల అనంతరం నూతన ప్రభుత్వాలు ఏర్పాటు తర్వాత 7 నెలలపాటు ఉన్న ప్లానింగ్ కమిషన్‌కు, ఆపై ఏర్పడిన నీతి ఆయోగ్‌కు అధ్యక్షుడు మోదీ అయినా నిర్ణయం తీసుకోలేదన్నారు. ప్యాకేజీ, ¬దాలలో చంద్రబాబు అడిగారన్న కారణంగా ప్యాకేజీ ఇస్తామని ఒప్పుకున్నట్లు కేంద్రం ఎన్నోమార్లు చెప్పిందని, ప్యాకేజీ ప్రకటన వినగానే రక్తం మరిగిందన్న చంద్రబాబు.. 5 నిమిషాల్లో ఎందుకు చల్లపడ్డారో ఏపీ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం నిర్ణయాలను సాదరంగా స్వాగతిస్తూ ఏపీ ప్రజలకు అన్యాయం చేశారంటూ మండిపడ్డారు. ఎట్టిపరిస్థితుల్లోనైనా రాష్ట్రానికి ¬దా ఇస్తేనే అభివృద్ధి సాధ్యమని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంలో మా పార్టీ అనేక కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. మా దీక్షలు, ధర్నాలను పలుమార్లు సీఎం చంద్రబాబు ఎగతాళి చేశారన్నారు. బెదిరింపుల ధోరణితో ఉండి, నిరుద్యోగులను సైతం బెదిరించారన్నారు. ¬దా విూటింగ్‌లకు వెళ్తే జైళ్లలో వేస్తామని, విూ పిల్లలపై పీడీ యాక్ట్ పెడతామంటూ నిరుద్యోగులు, విద్యార్థుల తల్లిదండ్రులను భయపెట్టారని వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో కొవ్వొత్తుల ర్యాలీకి వెళ్తుంటే ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌ను ఎయిర్‌పోర్టులోనే అడ్డుకోవడం దారుణం కాదా అని ప్రశ్నించారు. గవర్నర్, రాష్ట్రపతి, ప్రధాన మంత్రి లాంటి కీలక రాజ్యాంగ నేతలు అందరి దగ్గరికి వెళ్లి వైఎస్ జగన్ ఏపీలో పరిస్థితిని వివరించారన్నారు. ¬దా ఆవశ్యకతను వారితో చర్చించారని, కానీ టీడీపీ మాత్రం ¬దా పోరాట చర్యలను అడ్డుకున్నారన్నారు. ¬దా ఇచ్చేది లేదని కేంద్రం చెబితే.. ఏ పార్టీని అవమానించినట్లు కాదని, ఏపీ ప్రజలు మొత్తాన్ని అవమానపరిచినట్లేనని పేర్కొన్నారు. చంద్రబాబు మాత్రం ¬దా ఏమైనా సంజీవనా. ¬దా ఉన్న రాష్ట్రాలు ఏం సాధించాయని ఎదురు ప్రశ్నించారని గుర్తు చేశారు. ఆపై కేంద్రం ఏ ప్రకటన చేసినా శాలువాలు కప్పి వారికి ధన్యవాదాలు తెలిపారని ప్రశ్నించారు. సిగ్గు లేకుండా టీడీపీ అలాంటి చర్యలకు పాల్పడిందని, దేశంలోనే సీనియర్ నాయకుడిని అని చెప్పుకునే చంద్రబాబు యూటర్న్ ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. అవిశ్వాస తీర్మాణం ప్రవేశపెడితే 50 మంది ఎంపీల మద్దతు లభిస్తే చర్చ జరుగుతుందని చంద్రబాబుకు తెలుసని, తొలుత ఎవరు పోరాడినా మద్దతిస్తామన్న చంద్రబాబు 10 గంటల్లోనే మళ్లీ యూటర్న్ తీసుకున్నారన్నారు. వైఎస్సార్‌సీపీకి మేం ఎందుకు మద్దతు ఇవ్వాలని ప్రశ్నించారని, సభ ఆర్డర్‌లో లేదని సాకుగా చూపించి
అవిశ్వాస తీర్మానాన్ని పక్కనపెట్టిన స్పీకర్.. ఇతరత్రా కీలకబిల్లులని ఆమోదించారని గుర్తుచేశారు. చివర్లో ఏదైనా ప్రకటన వస్తుందని ఎదురుచూసినా నిరాశే ఎదురైందన్నారు. ఏప్రిల్ 6న వైసీపీ ఎంపీలు పదవులకు రాజీనామా చేసి ఆమరణ దీక్ష చేపట్టగా ఏదో ఓ సాకు చూపిస్తూ ఒక్కో రోజు ఒక్కరిని ఆస్పత్రికి తరలించి మా దీక్షను భగ్నం చేశారన్నారు. ఏపీకి ¬దా సాధన కోసం టీడీపీ, బీజేపీ ఎంపీలను సైతం రాజీనామా చేయాలని అప్పీల్ చేశామని, కానీ వారు రాజీనామా అనగానే దూరం జరిగారన్నారు. వాళ్లు సహకరిస్తే పరిస్థితి మరోలా ఉండేదని ఉమ్మారెడ్డి పేర్కొన్నారు. అవిశ్వాసం విషయంలో వెనక్కి తగ్గింది, డ్రామాలాడింది టీడీపీయేనంటూ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.