చంద్రబాబు 12వ రోజు పాదయాత్ర ప్రారంభం
ఉరవకోండ, అనంతపురం: తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన ‘ వస్తున్నా … మీకోసం’ పాదయాత్ర 12 వరోజు వజ్రకరూర్ మండలం చిన్నహోతూరు గ్రామం నుంచి ప్రారంభమైంది. యాత్ర ప్రారంభంలో విద్యార్థులు గిరిజన మహిళలతో చంద్రబాబు మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు వెంట పాదయాత్రలో ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, పార్థసారధి, ఎమెల్సీ బాబురా జేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.