చంద్రాయణానికి ఇకనైనా తెరదించాలి !
ఎపి అసెంబ్లీలో నిజంగానే నారా భువనేశ్వరిని వైసిపి సభ్యులు ఏమైనా అన్నారా ! అంటే ఏమన్నారో వీడియో క్లింప్పింగులు బయటకు రావాలి. ఆమెను అవమానించిన వారిని ఖచ్చింతంగా శిక్షించాలి. అవసరమైతే వారిని సభనుంచి సస్పెండ్ చేయాలి. అయితే అలాటిదేవిూ లేదని.. గత కొన్నిరోజులుగా జరుగుతున్న వ్యవహారాలను గమనిస్తే అర్థంఅవుతోంది. నిజాంగానే ఆమెను ఎవరు ఏమైనా అనివుంటే ఈ పాటికి సోషల్ విూడియా దులిపేసేది. చంద్రబాబు అధికారపార్టీని ఓ ఆటాడుకునే వారు. విూడియా కూడా ఇలాంటి వ్యవహారాల్లో ఉపేక్షించేది కాదు. ఇదంతా కేవలం రాజకీయ డ్రామా తప్ప మరోటి కాదని ప్రజలంతా చర్చించుకునే వారు కాదు. నారా భువనేశ్వరి అంటే అంటే తమకు గౌరవముందని వైసిపి సభ్యులు వ్యాఖ్యానించారు. అంబటి రాంబాబు, కొడాలి నానిలు మాట్లాడుతూ అసలు తాము భువనేశ్వరి ప్రస్తావనే తీసుకుని రాలేదన్నారు. నిజంగానే ఆమెను ఏమైనా అనివుంటే అదేరోజు అక్కడే చంద్రబాబు సభలో నిలదీయాల్సి ఉంది. కానీ సభలో ఆయన నిలదీయలేదు. సరికదా ఆరోజు సభలో ఆవేశంగానే ఉన్నారు. ప్రభుత్వంపై ఊగిపోయేంతగా ప్రతిన చేశారు. అసెంబ్లీలో ఎవరైనా చంద్రబాబును లేదా ఆయన కుటుంబ సభ్యులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన దాఖలాలు లేవు. ఉండివుంటే బయటకు వచ్చేది. రికార్డుల్లో కనిపించేవి. కానీ ఎక్కడా ఎవరు అన్నట్లుగా లేని వ్యాఖ్యలపై చంద్రబాబు సభ బయటకు వచ్చి విూడియా సమావేశంలో ఏడవడం..తన భార్యను అవమానించారని చెప్పడం..ఊరూరా దానిపై ప్రచారం చేసుకోవడం నిజంగా రాజకీయం తప్ప మరోటిగా కానరావడం లేదు. దాదాపు వారం రోజులు దాటినా సభలో జరిగిన వ్యవహారంపై ఎలాంటి ఆధారాలు బయటకు రాలేదు. నిజంగానే తన భార్య భువనేశ్వరిని అవమానించేలా ఎవరైనా వ్యవహరించి ఉంటే నిలదీయాల్సింది సభలోనే. కానీ చంద్రబాబు అలా చేయ లేదు. మొత్తంగా ఈ వ్యవహారంలో ఏమి జరిగిందన్న చర్చ ఇప్పుడు ప్రజల్లో సాగతోంది. ఏం జరిగిందన్న విషయం తెలియక ప్రజలు కూడా తికమక పడుతున్నారు. ఈ వ్యవహారంలో నిజాలు బయటకు రాకపోతే భార్యను రోడ్డు విూదకు తెచ్చిన ఘనత చంద్రబాబుదే. ఆయన రాజకీయ వ్యభిచారిగా వ్యవహరిస్తున్నారని మంత్రి కొడాలి నాని ఇప్పటికే దుయ్యబట్టారు. రాజకీయ అవసరాల కోసం భార్యను రోడ్డు విూదకు తేవడం అన్యాయం అంటూ మండిపడ్డారు. అనని వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ చంద్రబాబు ఊరూరా ప్రచారం చేస్తూ సాగుతున్నారని విమర్శలు గుప్పించారు. సెంటిమెంట్ రగిల్చి రాజకీయ లబ్ది పొందాలని చంద్రబాబు తాపత్రయంగా ఉందన్న నాని ఆరోపణలు నిజంకాదని నిరూపిం చాల్సిన అవసరం ఇప్పుడు చంద్రబాబుపై ఉంది. ఇన్నేళ్లుగా రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు ఇప్పుడు ఎన్టీఆర్ గురించి మొసలి కన్నీరు కార్చడం కూడా తగదు. చంద్రబాబు, టిడిపి నేతలు,ఓ వర్గం విూడియా అసలు ఏం జరిగిందో ప్రజలకు చెప్పకుండా విమర్శలకు దిగడం సరికాదు. ఓ రకంగా వీరంతా ఇప్పుడు భువనేశ్వరి పరువు దిగజార్చారని భావించాలి. వరదల్లో బాధితుల పరామర్శకు వెళ్లి.. తనను అవమానించారంటూ చంద్రబాబు ఏడుస్తున్న తీరు కూడా సరికాదు. చంద్రబాబునాయుడు తన సతీమణిని తానే బదనాం చేసుకున్నంత పనిచేయడం అత్యంత దురదృష్టకరం. ఆయన తన సతీమణి ప్రతిష్ఠను పణంగా పెడుతున్నానని చంద్రబాబు గుర్తించడం లేదు. కేవలం రాజకీయలబ్ది,ప్రజల్లో ఎన్టీర్ అన్న మహానాయకుడి సెంటింమెంట్‌ను తిరిగి పొందే ఓ ప్రయత్నంగా కనిపిస్తోంది. తన భార్యను అవమానించారని చెప్పడం ద్వారా సానుభూతి రాజకీయానికి పునాది వేశారని చెప్పాలి. అసెంబ్లీలో, ఆ తర్వాత జరిగిన ఉదంతాలను పరిశీలిస్తే మనకు ఇదంతా ఓ డ్రామా అన్న భ్రమ కలుగుతుంది. తన వ్యక్తిగత విషయాన్ని మొత్తం ప్రజలకు ఆపాదించే ఓ వ్యూహాత్మక రాజకీయం నడుస్తోందని అనుకోవాలి. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఇలా చేయడం …ముఖ్యంగా విూడియా ముంద వలపోయడం సరికాదు. ఎన్టీఆర్‌పై వైస్రాయ్ హోటల్ వద్ద చెప్పులు వేయించిన చరిత్ర చంద్రబాబు ది. ఈ ఒక్క ఘటనను పరిశీలిస్తే ఆయన అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారని ఆయనరాజకీయ చరిత్ర ద్వారా తెలుసుకోవచ్చు. అందుకే ఆయన తన సతీమణి ప్రతిష్టను పణంగా పెడుతున్నారన్న విమర్శలకు సమాధానం చెప్పలేకపోతున్నారు. అసెంబ్లీలో ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేసి ఉంటే కచ్చితంగా తప్పే అవుతుంది. వాటిని ఖండిరచా ల్సిందే. కాని దానిపై చర్చ కూడా జరగకముందే సభలో చంద్రబాబు లేచి ఆవేశంగా తాను సిఎం అయ్యే దాకా సభకు ఇక రానని భీషణ ప్రతిజ్ఞ చేశారు. నిజానికి నారా భువనేశ్వరిని ఎవరైనా ఏమైనా అనివుంటే దానిపైఆయన ప్రతిజ్ఞ చేసివుండేవారు. ఒకవేళ అంబటి రాంబాబు అభ్యంతర కరంగా మాట్లాడి ఉంటే, వెంటనే టీడీపీ సభ్యులంతా కలిసి అసెంబ్లీలో తేల్చుకుని ఉండాల్సింది. అంబటిపై చర్య తీసుకోవాలని కోరి ఉండాల్సింది. అలాకాకుండా చంద్రబాబు సభా బహిష్కారం ప్రకటన చేశారు. ఆ తర్వాత విూడియా ముందు విలపించడం…తనకు అవమానం జరిగిందని, తన భార్యను అవమానించారని చెప్పడం ద్వారా సానుభూతి రాజకీయానికి ప్రయత్నం చేసినట్లు అనిపిస్తుంది. అందుకే చంద్రబాబు ఊరూరా తిరుగుతూ తనకు అవమానం జరిగిందని చెబుతున్నా ఎక్కడా పెద్దగా స్పందన కానరావడం లేదు. పెద్దగా ప్రజలు పట్టించు కోవడం లేదు. నిర్దిష్ట ఆధారాలు లేకుండా తన భార్యను ఏదో అన్నారంటూ చంద్రబాబు మాట్లాడడం వల్లనే స్పందన కానరావడం లేదు. నిజంగానే ఏదైనా అనివుంటే అగ్గిపుట్టేది. తెలుగు ప్రజలు ముఖ్యంగా అన్న ఎన్టీఆర్ అభిమానులు చెలరేగాఏవారు. పార్టీలకు అతీతంగా ప్రజలంతా భువనేశ్వరి పక్కన నిలబడేవారు. ఎమ్మెల్యేలు ఎవరైనా అనుచితంగా మాట్లాడి ఉంటే, సంబంధిత వీడియో ని చంద్రబాబు విూడియా సమావేశంలో ప్రదర్శించి ఉండాలి. అప్పుడు వైఎస్సార్‌సీపీ ఆత్మరక్షణలో పడేది. కానీ ఆయన అలా చేయలేదు. ఆనాడు అసెంబ్లీ చర్చలో చంద్రబాబు తన భార్యను కించపరిచారంటూ, ఇది కౌరవ సభ, తాను ఇక్కడ ఉండను, మళ్లీ ª`భసీఎం అయ్యాకే అడుగుపెడతానని శపథం చేసి వెళ్లిపోవడం అంతా నాటకీయంగా జరిగిందనే చెప్పాలి. ఇంతటితో ఈ వ్యవహారం ముగిస్తే చంద్రబాబుకే మంచిది. అసెంబ్లీలో ఒకవేళ నిజంగానే అంబటి లేదా మరెవరైనా కనుక అభ్యంతర వ్యాఖ్యలు చేసి ఉంటే వాటిని కూడా టీడీపీ ఎమ్మెల్యేలు రికార్డు చేసి సోషల్ విూడియాలో వదిలేవారు. చంద్రబాబు విూడియా సమావేశం లో పెట్టి చూపేవారు. అవేవీ చేయలేదు.అంటే వారి వద్ద అలాంటి ఆధారాలూ ఏవీ లేవు. చంద్రబాబు అసంబ్లీకి రాకుండా ఉండాలనుకునే ఈ డ్రామా నడిపారన్నది కనిపిస్తున్న నిజం. అందుకే ఇప్పటికైనా ఈ వ్యవహారాన్ని ముగించాల్సింది చంద్రబాబే.