చంద్రారెడ్డిని అరెస్టు చేయాలని మహిళల ధర్నా

ఉప్పల్‌ : హైదరాబాద్‌ మహానగర పాలకసంస్థ మాజీమేయరు బండ కార్తీకరెడ్డి భర్త చంద్రారెడ్డిని అరెస్టు చేయాలని మల్కాజ్‌గిరి ఏసీబీ కార్యాలయం ముందు మహిళలు ధర్నా చేపట్టారు. లాలాపేటకు చెందిన ఓ దళిత వ్యక్తిని కులం పేరుతో దూషించినందుకు మల్కాజ్‌గిరి పోలీసుస్టేషన్‌లో చంద్రారెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదైంది. అయినప్పటికీ చంద్రారెడ్డిని అరెస్టుచేయకపోవడంతో ఎమ్మార్పీఎస్‌, తెరాస, డీఎంఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో మహిళలు ఏసీబీ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు.