చలివేంద్రం ప్రారంభం

కాగజ్‌నగర్‌: అటవీ శాఖ చెక్‌పోస్ట్‌ సమీపంలో ఉన్న పెట్రోల్‌ బంక్‌లో పనిచేస్తున్న యువకులు, స్థానిక వ్యాన్‌ అసోసియేషన్‌ సభ్యుల ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వ్యాన్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శివకుమార్‌, యువకులు ఆనంద్‌రెడ్డి , కిరణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.