చలో అసెంబ్లీని విజయవంతం చేయాలి: ఈటెల

హైదరాబాద్‌ : ఈ నెల 14న జరిగే చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెరాస నేత ఈటెల రాజేందర్‌ పిలుపునిచ్చారు. తెరాస భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని ప్రభుత్వం అణచివేయాలని చూస్తోందని అరోపించారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృషించినా చలో అసెంబ్లీని విజయవంతం చేసి తీరుతామని స్పష్టం చేశారు.