‘చలో అసెంబ్లీ’పై ప్రభుత్వం అణచివేత ధోరణి

హైదరాబాద్‌ : చలో అసెంబ్లీ కార్యక్రమంపై ప్రభుత్వం అణచివేత ధోరణి అవలంబిస్తోందని తెలంగాణ ఐకాస అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. ఐకాస నేతలు పిట్టల రవీందర్‌, టీఎన్టీవో అధ్యక్షుడు దేవీప్రసాద్‌కు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా చలో అసెంబ్లీని నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు.