చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి:
కోదండరాం
మెయినాబాద్ : శాసనసభలో తెలంగాణ బిల్లును ప్రవేశ పెట్టాలంటూ రాజకీయ ఐకాస ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో బస్సు యాత్ర ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం సాధించే వరకూ పోరాటం చేస్తామని రాజకీయ ఐకాస అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ఈ నెల 14న నిర్వహించే చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెరాస పొలిట్‌బ్యూరో సభ్యుడు చంద్రశేఖర్, పరిగి ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి, భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు దేవీప్రసాద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.