చలో అసెంబ్లీ గోడ పత్రికల ఆవిష్కరణ

హైదరాబాద్‌ : ప్రభుత్వం ఎన్ని నిర్భందాలు పెట్టినా ఈ నెల 14న చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని తెలంగాణ ఐకాస అధ్యక్షుడు ఆచార్య కోదండరామ్‌ స్పష్టం చేశారు. హైదరాబాద్‌ అసెంబ్లీ ఎదురుగా ఉన్న గస్‌పార్క్‌ ముందు ఓయూ ఐకాస ఏర్పాటు చేసిన చలో అసెంబ్లీ గోడ పత్రికలను కోదండరామ్‌ అవిష్కరించారు. చలో అసెంబ్లీలో విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోదండరామ్‌ పిలుపునిచ్చారు.