చలో అసెంబ్లీ పోస్టర్ విడుదల చేసిన జేఏసీ ఛైర్మన్ కోదండరాం
హైదరాబాద్, (జనంసాక్షి): తెలంగాణ రాజకీయ జేఏసీ తలపెట్టబోయే ‘చలో అసెంబ్లీ’ పోస్టర్‌ను జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఛలో అసెంబ్లీకి సంబధించి ఈ నెల నుంచి తెలంగాణ వ్యాప్తంగా ప్రచార యాత్రలు చేపడుతామని తెలిపారు. దళతి ఎంపీలు రాజీనామా చేస్తే కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. అదే కావూరి సాంబశివరావు రాజీనామా చేస్తే అధిష్టానం ఆయన్ను పిలిచి మాట్లాడిరదని గుర్తు చేశారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలపై అధిష్టానం పక్షపాత వైఖరి ప్రదర్శిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు ఎంపీలు డెడ్‌లైన్లు పెట్టడం కాదు, కాంగ్రేస్సే పలుమార్లు తెలంగాణకు డెడ్‌లైన్లు పెట్టిందని గుర్తు చేశారు. కమిటీల పేరుతో కాలయాపన చేయడం తప్ప సమస్య పరిష్కారానికి చొరవ చూపడం లేదని మండిపడ్డారు.