*చలో ప్రగతి భవన్ పోస్టర్స్ ఆవిష్కరణ*
ప్రజా సమస్యల పరిష్కారానికై సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఛలో ప్రగతి భవన్ కు పిలుపునివ్వడం జరిగింది 8 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదు, 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడు చేసుకున్న ఆదివాసులకు గత ఎన్నికలలో కుర్చీ వేసుకుని అక్కడే కూర్చొని పోడు భూములకు పట్టాలు ఇస్తానని వాగ్దానం చేసి మూడు సంవత్సరాలు దాటింది,అట్లాగే రేషన్ బియ్యం తప్ప అన్ని రకాల వస్తువులు కట్ అయ్యాయి, కౌలుదారుల సమస్యలు, ధరణి, రైతాంగ రుణాల మాఫీ, అర్హులైన వారికి రేషన్ కార్డులు, ఇల్లు లేని వారికి రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం లాంటి పథకాలాన్ని పడకేశాయి, ముఖ్యమంత్రి గారు ప్రజలను కలిసేది లేదు చెప్పితే వినేది లేదు అందుకే తప్పనిసరిగా ముఖ్యమంత్రితో ములాఖత్ కై పాదయాత్ర చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు, జూలై 4న తెలంగాణ రైతంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య వర్ధంతి రోజున జరిగే కార్యక్రమంలో బాధిత ప్రజలందరూ పాల్గొనవలసిందిగా కోరారు.
ఈ కార్యక్రమంలో అరుణోదయ జిల్లా అధ్యక్షుడు ఉదయగిరి, IFTU జిల్లా సహాయ కార్యదర్శి నరసింహారావు, లక్ష్మయ్య, రవి,నాగయ్య, వెంకటేశ్వర్లు, వెంకటి, రాజ, నాగేష్ తదితరులు పాల్గొన్నారు
Attachments area