చలో ప్రగతి భవన్ వెళ్తున్న ఆదివాసీ నాయకుల ముందస్తు అరెస్టు.

ఫోటో రైటప్: నెన్నెల పోలీసు స్టేషన్లో ఆదివాసీ నాయకులు.
బెల్లంపల్లి, ఆగస్టు9, (జనంసాక్షి)
పోడు, గిరిజన గోడు కార్యక్రమంలో భాగంగా చలో ప్రగతి భవన్ కు వెళ్లనున్న ఆదివాసీ నాయకులను నెన్నెల పోలీసులు ముందస్తు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈసందర్భంగా సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు గుగులోత్ మల్లేష్ నాయక్ మాట్లాడుతూ చలో ప్రగతి భవన్ కార్యక్రమానికి వెళుతున్న ఆదివాసీ నాయకులను
ముందస్తు అరెస్ట్ చేయడం చాలా బాధకరం అన్నారు. నిండు శాసన సభలో పోడు భూములకు పట్టాలు ఇస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ 8 నవంబర్ 2021నుండి 31 డిసెంబర్ 2021 వరకు పొడుభూములకు దరఖాస్తు స్వీకరించారని, గిరిజన శాఖ మంత్రి శ్రీ సత్యవతి రాథోడ్ అధ్యక్షతన ఒక సబ్ కమిటీ వేసి సంవత్సరం గడుస్తున్న పొడుభూముల సమస్య పరిస్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్య మంత్రికి సమయం లేనందున ప్రపంచం ఆదివాసీ దినోత్సవం రోజు అయినా తమ సమస్య పరిష్కారం కోరుతూ రాష్ట్ర కమిటీ సూచన మేరకు సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షులు గుగులోత్ మల్లేష్ నాయక్ అధ్యరంలో పోడు-గిరిజన గోడు అనే నినాదంతో చలో ప్రగతి భవన్ ముట్టడికి హైదరాబాద్ కి బయలు దేరిన క్రమంలో నేన్నెల పోలీస్ వారు ముందస్తు అరెస్ట్ చేయడం చాలా బాధా కరమని అయన అన్నారు. అరెస్ట్ చేసిన తమను వెంటనే బేషరతు గా విడుదల చేయాలన్నారు. అరెస్ట్ అయినా వారిలో బానోత్ మధుకర్, దారావత్ సంతోష్, దారావత్ రాకేష్, బానోత్ రాజకుమార్, దారావత్ సాయి కిరణ్ బుక్య ప్రశాంత్ వున్నారు