చల్లని ముచ్చట..

– బాబ్లీ నుంచి వరదనీరు

– ఎస్సారెస్పీని చేరుతున్న గోదావరి జలాలు

ఆదిలాబాద్‌,జూన్‌ 11(జనంసాక్షి):మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు మనకు జలసిరులు తెస్తున్నాయి. గోదావరిపై ఆ రాష్ట్రంలో ఉన్న బాబ్లీ ప్రాజెక్టు పూర్తిగా నిండింది. దీంతో, నీటిని కిందికి వదులుతున్నారు. నాలుగు గేట్లు ఎత్తి 98,873 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నీరు మంగళవారం మధ్యాహ్నానికి మన రాష్ట్రంలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఎస్సారెస్పీలోకి రెండు టీఎంసీల నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మహారాష్ట్రలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో బాబ్లీ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. వరద నీరు అధికంగా రావడం వల్ల బాబ్లీ ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి నీటి విడుదలకు అధికారులు నిర్ణయించారు. 2 గేట్ల ద్వారా 20 వేల క్యూసెక్కుల నీటి విడుదలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. నీటి విడుదల కారణంగా కింది ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. బాబ్లీ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. 2 గేట్ల ద్వారా 20 వేల క్యూసెక్కుల నీటిని నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి విడుదల చేశారు. రేపటిలోగా ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు 2 టీఎంసీల నీరు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. జోగులాంబ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు కూడా వరద పోటెత్తింది. ప్రాజెక్టులకు జలకళ వస్తుండడంతో రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.